139 మద్యం దుకాణాలు రెన్యువల్‌ | - | Sakshi
Sakshi News home page

139 మద్యం దుకాణాలు రెన్యువల్‌

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

139 మద్యం దుకాణాలు రెన్యువల్‌

విజయనగరం రూరల్‌: జిల్లాలోని ఏ– 4 మద్యం దుకాణాల రెన్యువల్‌ ప్రక్రియలో భాగంగా 139 దుకాణాలకు రెన్యువల్‌ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎకై ్సజ్‌ అధికారి బమ్మిడి శ్రీనాథుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాల మేరకు.. 2026 – 2027 సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాల రెన్యువల్‌ ప్రక్రియ ఈ నెల 21తో ముగిసినప్పటికీ.. సుమారు 40 మద్యం దుకాణాలను రెన్యువల్‌ చేయడానికి యజమానులు ఆసక్తి చూపలేదు. అయితే ప్రభుత్వం మరో రెండు రోజుల గడువు పొడిగించడంతో బుధవారం నాటికి మరో 10 మద్యం దుకాణాలను రెన్యువల్‌ చేసుకునేందుకు యజమానులు ముందుకువచ్చారు. చీపురుపల్లి ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా 19 మద్యం దుకాణాలకు గాను 9 దుకాణాలకే రెన్యువల్‌ జరగగా, 10 దుకాణాలు రెన్యువల్‌ కాకుండా మిగిలిపోయాయి. కొత్తవలస, ఎస్‌.కోట స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని మద్యం దుకాణాలను యజమానులు రెన్యువల్‌ చేయగా.. నెల్లిమర్ల పరిధిలో ఒకటి రెన్యువల్‌ కాకుండా మిగిలిపోయింది. అలాగే భోగాపురం సర్కిల్‌ పరిధిలో 5, విజయనగరం 1, 2, గజపతినగరం, రాజాం సర్కిళ్ల పరిధిలో మూడేసి దుకాణాలకు రెన్యువల్‌ కాలేదు. బొబ్బిలి ఎకై ్సజ్‌ సర్కిల్‌ పరిధిలో రెండు మద్యం దుకాణాలకు రెన్యువల్‌ కాలేదు. అయితే దుకాణాల రెన్యువల్‌ ఫీజు ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 35 కోట్ల మేర ఆదాయం సమకూరింది. రెన్యువల్‌ ద్వారా కేటాయింపు పొందని 30 మద్యం దుకాణాలను లాటరీ ప్రక్రియ ద్వారా ఇతరులకు కేటాయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement