పూసపాటిరేగ: మండలంలోని గైతులచోడవరం సమీపంలో గల సబూరి ప్లైవుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో కార్మికురాలు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. చింతపల్లి గొల్లపేటకు చెందిన గజ్జి సుబ్బలక్ష్మి (38) సబూరి ఫ్యాక్టరీలో ప్లే డివిజన్‌లో పని చేస్తోంది. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ కోర్‌బేల్ మీద పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను విజయనగరం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందింది. ఆమెకు భర్త రాములప్పడు, ఇద్దరు కుమారులున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఎస్సై వి.అరుణ్‌కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ మృతి


