● గతంలో ప్రత్యేక ప్యాకింగ్‌తో బియ్యం
● రెండు నెలలుగా సాధారణ బియ్యమే సరఫరా
● జిల్లాలో 71,991 మంది లబ్ధిదారులు
విజయనగరం ఫోర్ట్: సీ్త్ర, శిశు సంక్షేమానికి కోట్లాది రుపాయిలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెబుతుంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహార లోపం బారిన పడకుండా ఉండేందుకు వారికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని కూటమి సర్కార్ చెబుతుంది. ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు అందించే సార్టెక్స్ బియ్యం సరఫరా నిలిచిపోవడమే ఆరోపణలకు ఊతమిస్తుంది. అంగన్‌వాడీ కేంద్రాల పరిఽఽధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలకు విటమిన్స్, మినరల్స్‌తో కలిపిన సార్టెక్స్ బియ్యం అందించేవారు. గత రెండు నెలలుగా షార్ట్ ఎక్స్ బియ్యం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా కావడం లేదు. సాధారణ బియ్యమే లబ్ధిదారులకు అందిస్తున్నారు.
జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మిని అంగన్‌వాడీ కేంద్రాలు 292,. మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు 2207 కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 71,991 మంది లబ్ధిదారులు ఉన్నారు. గర్భిణులు 7300 మంది, బాలింతలు 7077 మంది ఉన్నారు. 6నెలలు లోపు పిల్లలు 6509 మంది, 7 నెలలు నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 35,208 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 15,897 మంది ఉన్నారు.
టేక్‌హోం రేషన్
గర్భిణులు, బాలింతలకు నెలకు సరిపడ బియ్యం అందిస్తారు. ఒక లబ్ధిదారునికి నెలకు 3 కేజీలు బియ్యం, 5 లీటర్లు పాలు, 25 గుడ్లు, రెండు కేజీలు రాగి పిండి, పావు కేజీ చెక్కీలు, పావు కేజీ బెల్లం, కేజీ అటుకులు, అర లీటరు నూనె లబ్ధిదారులకు అందిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు ప్రతీ రోజు 75 గ్రాములు బియ్యం, 15 గ్రాములు పప్పు, 5 గ్రాములు నూనె చొప్పన వండి అంగన్‌వాడీ కేంద్రంలోనే పెడతారు. గర్భిణులకు 3కేజీలు బియ్యం చొప్పున నెలకు 219 క్వింటాళ్లు అవసరం అవుతాయి. బాలింతలకు 212.31 క్వింటాళ్లు బియ్యం అవసరం పడతాయి. 15,897 మంది పిల్లలకు నెలకు 357.6 క్వింటాళ్లు బియ్యం అవసరం పడతాయి.
సాధారణ బియ్యమా..!
అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులకు ప్రత్యేక ప్యాకింగ్‌తో కూడిన షార్ట్ ఎక్స్ బియ్యం అందించే వారు. ప్రస్తుతం లూజ్ బియ్యం అందిస్తున్నారు. అయితే వీటిని షార్ట్ ఎక్స్ బియ్యం అనుకుంటున్నాం. సాధారణ బియ్యం అని తెలియదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
– కేవీ బాలమణి, పీడీ, ఐసీడీఎస్


