వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ మంగళవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బెల్లాన చంద్రశేఖర్ తన కుమారుడు చీపురుపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, కోడలు పావనితో కలిసి తాడేపల్లి వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
– చీపురుపల్లి


