ప్రతి ఒక్కరు భక్తిభావాన్ని అనుసరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరు భక్తిభావాన్ని అనుసరించాలి

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

రేగిడి: ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అనుసరిస్తే మానసిక ప్రశాంతతకు ఎంతో తోడ్పాటునందిస్తుందని గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన శ్రీనివాసరామానుజన్‌ దాస్‌ అన్నారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని మండల పరిధిలోని రేగిడి గ్రామంలో సోమవారం ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది ఒక్క ఆధ్యాత్మిక చింతనతోనే సాధ్యమన్నారు. మానవసేవే మాధవసేవగా, సమాజసేవయే పరమాత్ముని సేవగా భావించి ప్రతి ఒక్కరు దైనందిన జీవితాన్ని గడపాలన్నారు. కార్యక్రమంలో కిమిడి సూరపునాయుడు, కిమిడి రవిబాబు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement