● పంటలు ధ్వంసం చేశారు.. | - | Sakshi
Sakshi News home page

● పంటలు ధ్వంసం చేశారు..

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

సాలూరు, రామభద్రపురం మండలాల పరిధిలోని సుమారు 60 ఆదివాసీ కుటుంబాలు గత నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న జీడి, మామిడి, పత్తి తోటలను అధికారులు పొక్లెయిన్లతో ధ్వంసం చేశారంటూ బాధితులు కలెక్టరేట్‌ ఎదుట రోదించారు. 2009లో తమకు అటవీ హక్కుల పట్టాలు ఇచ్చారని, అయితే ఈ నెల 9వ తేదీన అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పంటలను నాశనం చేసి అడ్డువచ్చిన వారిని పోలీసులతో అదుపులోకి తీసుకున్నారని వాపోయారు. ఈ ఘటనపై విచారణ జరిపి పంట నష్టపరిహారంతో పాటు తమ భూములు తమకు దక్కేలా చూడాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement