ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన లోపాలతో కూడిన ధ్రువీకరణలు ఇద్దరు నిస్సహాయుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. గుంకలాం గ్రామానికి చెందిన కాకినాడ నరసింగరావు గత మూడేళ్లుగా మంచానికే పరిమితమై లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ, సదరం సర్టిఫికెట్‌లో వైకల్యాన్ని తాత్కాలికంగా పేర్కొనడంతో పింఛన్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ధర్మపురి వాసి ఒలిపిల్లి వెంకటరమణ పక్షవాతంతో చేతులు, కాళ్లు చచ్చుబడి ఊతకర్రతో మాత్రమే నడవగలుగుతున్నా, అధికారులు కేవలం 40 శాతం వైకల్యంగా మాత్రమే నమోదు చేయడంతో పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సరైన ధ్రువీకరణలు జారీ చేసి పింఛన్లు అందేలా చూడాలని చేతులెత్తి అధికారులను వేడుకున్నారు.
నడవలేని స్థితిలో ఉన్నా తాత్కాలిక వైకల్యం అని రాశారని కలెక్టరేట్‌కు వచ్చిన కాకినాడ నరసింగరావు


