రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి | - | Sakshi
Sakshi News home page

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

రజకులను తక్షణమే ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల కోసం ప్రతి జిల్లాలో రజక ఆశ్రమ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని, మహిళా సంఘాలకు ఉన్నతి పథకం కింద వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కోరారు. కులవృత్తిదారులపై దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం తేవడంతో పాటు దోబీఘాట్ల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. జనాభా ప్రకారం రాజకీయ పదవులు ఇవ్వాలని, టీటీడీతో పాటు ప్రముఖ దేవాలయాల్లో పారిశుధ్య, నిర్వహణ పోస్టులను రజకులకే కేటాయించేలా పాత జీఓలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement