జాతీయ స్థాయి పారా వాలీబాల్‌ పోటీలకు సచివాలయం ఉద్యోగి | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పారా వాలీబాల్‌ పోటీలకు సచివాలయం ఉద్యోగి

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

జాతీయ స్థాయి పారా వాలీబాల్‌ పోటీలకు సచివాలయం ఉద్యోగి

కొత్తవలస: ఈ నెల 25వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని ఈ రోడ్‌లో జరగనున్న 3వ నేషనల్‌ ఫెడరేషన్‌ కప్‌–2026 (జాతీయ స్థాయి పారా సిటింగ్‌ వాలీబాల్‌ పోటీలు)కు మండలంలోని గనిశెట్టిపాలెం సచివాయంలో డిజిటల్‌ సహాయకుడిగా పని చేస్తున్న పొలిపిరెడ్డి శ్రీను ఎంపికై నట్లు ఎంపీడీఓ ఎస్‌.రమణయ్య శుక్రవారం తెలిపారు.ఈ నెల 6వ తేదీన విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన ఎంపికల్లో శ్రీను ఎంపికై నట్లు ఆయన తెలిపారు. 25వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలో జరగనున్న నేషనల్‌ ఫెడరేషన్‌ కప్‌–2026 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు కేరళ, హర్యానా, రాజస్థాన్‌, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు శ్రీను కెఫ్టెన్‌గా వ్యవహరించనునట్లు ఆయన తెలిపారు.ఈ మేరకు శ్రీనుకు ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు అధికారిక సెలవులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా శ్రీనుకు పలువురు తోటి ఉద్యోగులు అభినందనలు తెలపారు.

రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement