రేగిడి: మండలంలోని సంకిలి గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలు ఏపీ చెరకు రైతు సంఘం, సంకిలి సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నదని చెరకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. చక్కెర కర్మాగారం పరిరక్షణలో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై రైతులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
మూడుకొండల ఆవల..
24 గంటలు
సీతంపేట: కొండకోనల్లో తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, సీతంపేట పోలీసులు, గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట మండలం కిండంగి పంచాయతీ గులుమూరు గ్రామానికి చెందిన సవర రామ్మూర్తి, మహేశ్వరి దంపతుల పెద్దకుమా రుడు నాలుగేళ్ల వయస్సున్న సిద్ధు మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. తండ్రి ఉపాధి పనులకు వెళ్లాడు. తల్లి ఇంటివద్ద వంట పనులు చేసుకుంటోంది. ఈ సమయంలో బాలుడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయా డు. గ్రామంలో ఎక్క డో ఓ దగ్గర ఆడుకుని వస్తాడులే అని కుటుంబ సభ్యులు అనుకున్నారు. సాయంత్రం వరకు బాలు డు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులతో కలిసి చుట్టుపక్క న గ్రామాలతో పాటు బంధువుల ఇళ్లల్లో గాలించా నా బాలుడి ఆచూకీ దొరకలేదు. వెంటనే సీతంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్‌ఐ వై.అమ్మన్నరావు ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ, సీఐల ఆధ్వర్యంలో ఎస్‌ఐ, స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రి సమయంలో వర్షం కురుస్తున్నా గాలించాయి. కొండమార్గాలు, లోయలు, దట్టమైన అడవిని జల్లెడ పడుతూ, గ్రామస్తులతో కలిపి గాలించారు. గంటలు గడుస్తు న్న కొద్దీ కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో గులుమూరు గ్రామానికి ఆనుకుని కొండప్రాంతంలోని లోయ పక్కన బాలుడి ఆచూకీ కను గొన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్లు దూరంగా విస్తరించి ఉన్న మూడు కొండలు దాటి బాలుడు వెళ్లిపోయాడు. రాత్రంతా వర్షంలో తడుస్తూ ఒంటరిగానే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆహారం, నీరు లేకపోవడంతో నీరసించిపోయాడు. బాలుడిని వెంటనే తల్లిదండ్రుల సమక్షంలో ప్రాథమిక చికిత్స కోసం కుశిమి పీహెచ్‌సీకి తరలించారు.


