శృంగవరపుకోట : అమరావతి చాంపియన్‌షిప్ – 2026 రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో జరుగనున్నాయి. పోటీలకు విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ టీం కోచ్‌గా శృంగవరపుకోట నియోజకవర్గ క్రీడా కోఆర్డినేటర్ డాక్టర్ పొట్నూరు శ్రీరాములు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియన్ షిప్–2026లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల నుంచి 12 అంశాలలో క్రీడాకారులు పాల్గొంటారని, అందులో అండర్ 17, 23 విభాగాలలో పురుషులు, సీ్త్రలు పాల్గొంటారని, ఈ క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. క్రీడలకు మొత్తం 99 లక్షల రూపాయలు బహుమతిగా అందిస్తుందన్నారు. ఈ క్రీడలు ఆగస్టు 29న హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జరగనున్నట్టు ఆయన తెలిపారు.


