సికింద్రాబాద్: వివాహవేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గురైన ఒక మహిళ శనివారం రైలులోనే మృతి చెందింది. జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ కె.కోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... ఘట్‌కేసర్ బాలాజీనగర్‌కు చెందిన గృహిణి శివం జానకి (42) కుటుంబ సభ్యులతో కలిసి పార్వతీపురంలోని బంధువుల వివాహవేడుకకు హాజరైంది. శుక్రవారం నాగావళి ఎక్స్‌ప్రెస్ రైలులో తిరిగి బయలుదేరింది. రైలు చర్లపల్లికి చేరుకోగానే తీవ్ర అస్వస్థతకు గురైన జానకి ఎస్–1 కోచ్‌లోనే మృతి చెందింది. భర్త నర్సింగరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


