‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ జిల్లా స్థాయి పోటీల విజేతలు | - | Sakshi
Sakshi News home page

‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ జిల్లా స్థాయి పోటీల విజేతలు

Jul 30 2026 1:15 AM | Updated on Jul 30 2026 1:15 AM

విజయనగరం అర్బన్‌: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’–‘వై డిస్ట్రిక్ట్‌ టేక్స్‌ ఆఫ్‌’ థీమ్‌పై జిల్లా స్థాయి వ్యాసరచన, చిత్రవేఖనం, క్విజ్‌ పోటీలు ఎంఆర్‌సంస్కృత ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి మండల స్థాయిలో ఎంపికై న విద్యార్ధులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి యూ.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓ కె.వెంకటరమణ, డీసీఈబీ కార్యదర్శి టి.సన్యాసిరాజు విజేతలకు బహుమతులు ప్రకటించారు. జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల విజేతలు ప్రథమ: ఎస్‌.భానుప్రకాశ్‌ (జెడ్‌పీహెచ్‌ జరజాపుపేట), ద్వితీయ: జి.హేమలత (జెడ్‌పీహెచ్‌ వల్లాపురం), తృతీయ: కె.గీత (కేజీబీవీ, మెరకముడిదాం), చిత్రలేఖనం విజేతలు ప్రథమ: పి.బాలాజీ (జెడ్‌పీహెచ్‌ బొద్దూరు), ద్వితీయ: బి.జయశ్రీ (జీజీహెచ్‌ఎస్‌ విజయనగరం), తృతీయ: సీహెచ్‌.సంధ్య (జెడ్‌పీహెచ్‌ఎస్‌, బుడతనాపల్లి), క్విజ్‌ విజేతలు ప్రథమ: ఎం.లోహిత, బి.చరణ్‌ (ఏపీఎంఎస్‌, అక్కివరం), ద్వితీయ: పి.తనిష్క (జెడ్‌పీహెచ్‌ చీపురుపల్లి), బి.కొండలరావు (జెడ్‌పీహెచ్‌ఎస్‌, పాలవలస), తృతీయ: ఎం.శంకర్‌ (జెడ్‌పీహెచ్‌ఎస్‌ గోవిందపురం), సీహెచ్‌.మౌనిక (జెడ్‌పీహెచ్‌ఎస్‌ కుమిలి). విద్యార్థుల్లో సృజనాత్మకత, జిల్లాపై గౌరవభావాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని డీఈఓ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement