నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధ ర్ ఆదివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థా న అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల తో ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్థాన మండపంలో వేద ఆశీర్వచనాలు అందజేసి, ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యాన్ని జస్టిస్ ఆలపాటి గిరిధర్‌కు వివరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, మెజిస్ట్రేట్ సాయి చక్రవర్తి, తహసీల్దార్ శ్రీకాంత్, ఈఓ వై.శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం రూరల్: జేఎన్‌టీయూ జీవీ ఆధ్వర్యంలో జర్మన్ భాష శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు ఈ నెల 15 నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు జేఎన్‌టీయూ జీవీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపికై న అభ్యర్థుల జాబితాను జేఎన్‌టీయూ జీవీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు హాజరై జర్మన్ భాషా ప్రావీణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్త వృత్తి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పూసపాటిరేగ : భోగాపురం ఎయిర్‌పోర్టుకు విద్యుత్ లైన్ వేసే రైతుల భూములకు సంబంధించి పరిహారం చెల్లించలేదని కొవ్వాడకు చెందిన పలువురు రైతులు గైతులుచోడవరం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన తమ భూములు గుండా విద్యుత్ లైన్ వేసి నేటికి పరిహారం చెల్లించలేదని గ్రామానికి చెందిన తెలుగు నాగరాజుతో పాటు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టుకు హెవీ విద్యుత్ లైన్ వేసినప్పటికి రైతులకు ఎటువంటి పరిహారం చెల్లించలేదన్నారు. నిరసనలో కొవ్వాడ గ్రామానికి చెందిన మిరప రాంబాబు, సిమ్మల లక్ష్మణరావు, తెలుగు లక్ష్మణ, మిరప సంతోష్‌తో పాటు పలువురు పలువురు రైతులు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవా రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్య ల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారులు దరఖాస్తుల్లో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని, సమస్యకు సంబంధించిన ఆధారాలను జతపరచాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రశీదును తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎస్‌ఎంఎస్ సౌకర్యాన్ని కల్పించిందున, సమస్య పరిష్కారం అనంతరం నోటీసులు లేదా ఎండార్స్‌మెంట్లు వాట్సాప్, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపుతారని వివరించారు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు.
రెవెన్యూ క్లినిక్
భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ రికార్డులతో హాజరవుతారని తెలిపారు. రైతులు తమ భూ వివాదాలు, మ్యుటేషన్‌లు, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్జప్తి చేశారు.


