ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి ● ఫ్యాప్టో జిల్లా కమిటీ డిమాండ్‌

విజయనగరం అర్బన్‌: ఉపాధ్యాయ, ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఫ్యాప్టో జిల్లా నేతలు పలు ముఖ్యమైన డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు విద్యాహక్కు చట్టాన్ని సవరించి టెట్‌ రద్దు చేసి అప్పటి వరకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని కోరారు. 12వ వేతన సవరణ సంఘాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను ప్రకటించి బకాయిలు వెంటనే చెల్లించాలని, పంచాయతీరాజ్‌ యాజమాన్యంలో కారుణ్య నియామకాలను పూర్తి చేసి, హైస్కూల్‌ ప్లస్‌ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి ఉన్నత పాఠశాలలో నాన్‌–టీచింగ్‌ సిబ్బంది, కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించడంతో పాటు మున్సిపల్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌, గురుకులాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్ల పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్‌ సీహెచ్‌ భాస్కరరావు, కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్‌, జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, వి.రమణ, ఎస్‌.భాస్కరరావు, పి.రామారావు, పి.దామోదర్‌నాయుడు, ఎస్‌.ఎస్‌.దొర, ఎన్ని అప్పలనాయుడు, టి.శ్రీనివాస్‌, కె.రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement