ఖరీఫ్‌ సాగుకు సరిపడా ఎరువులు | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ సాగుకు సరిపడా ఎరువులు

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

ఎరువుల కోసం రైతుల క్యూ

విజయనగరం అర్బన్‌: జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఎరువులు దొరకకపోయినా, బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినా, అధిక ధరలకు విక్రయించినా రైతులు వెంటనే సెల్‌: 83310 56279 నంబర్‌కు ఫిర్యాదుచేయవచ్చన్నారు. రైతు సేవా కేంద్రాల్లో 11,288 మెట్రిక్‌ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచామని, వరికి ఎకరాకు 75 కిలోలు (3 దఫాలుగా), మొక్కజొన్నకు 150 కిలోలు (3 దఫాలుగా), పత్తికి 130 కిలోలు (4 దఫాలుగా), చెరకుకు 250 కిలోలు (4 దఫాలుగా) వేయాలని పేర్కొన్నారు. ‘ఎల్‌నినో’ ప్రభావం వల్ల ఈ ఏడాది, వచ్చే ఏడాది వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్నామ్యాయ, ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలని ఆయన కోరారు.

డిజిటలైజేషన్‌ కోసం బీఎల్‌ఓను సంప్రదించండి

జిల్లాలో డిజిటలైజేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందని, ఇప్పటివరకు సుమారు 84 శాతం పూర్తయిందని కలెక్టర్‌ తెలిపారు. సర్‌ ప్రక్రియ పురోగతిని వివరించారు. జిల్లాలో 1,578,949 మంది ఓటర్లు ఉండగా వీరిలో ఇప్పటివరకు 13,25,000 మందికి డిజిటలైజేషన్‌ పూర్తయినట్టు చెప్పారు. పట్టణప్రాంతాల్లో డిజిటలైజేషన్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల ఎవరైనా మిగిలిపోయి ఉంటే డిజిటలైజేషన్‌ను పూర్తి చేసేందుకు వెంటనే తమ పరిధిలోని బీఎల్‌ఓను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 14వ తేదీలోగా ఈ ప్రక్రియ ముగుస్తుందని, సిబ్బందికి సహకారం అందించాలని కోరారు.

ఈ చిత్రం చూశారా... వీరంతా రైతులు. బాడంగిలోని ఓ ప్రైవేటు దుకాణం వద్ద ఎరువుల కోసం శనివారం క్యూ కట్టారు. ఆధార్‌కార్డులు, ఓటీపీ చెప్పేందుకు ఫోన్‌లు పట్టుకుని ఇలా నిల్చొన్నారు. యూరియా కోసం రెండేళ్లుగా అగచాట్లు తప్పడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులిచ్చి కొనుగోలుచేసుకున్న ఎరువుల కోసం పనులు మానుకుని దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయారు. – బాడంగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement