సంతకవిటి: తమరాం వద్ద ఎండిపోతున్న వరి వెదలు
తొలకరిలో చినుకు కరువైంది. రైతన్నకు సాగు భారంగా మారింది. మండుతున్న ఎండలకు ఎండుతున్న వరి వెదలు, నారుమడులను చూసి గుండె బరువెక్కుతోంది. పెట్టుబడి తడిసిమోపెడవుతున్నా అవకాశం ఉన్నచోట బావుల నీటితో నారుమడులను తడుపుతున్నారు. వరుణదేవుడా.. కరుణించరావా.. అంటూ ప్రార్థిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు మొఖం చాటేయడంతో ఖరీఫ్‌లో మెట్టభూముల్లో సాగుచేసిన మొక్కజొన్న, కూరగాయల పంటలు సైతం ఎండిపోతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల కాకపోవడం, మడిని తడిపే ఆదరువు లేకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు.
రాజాం: పొగిరి సమీప పంటపొలాల్లో
ఎండిపోతున్న మొక్క జొన్న


