జోనల్‌ మేనేజర్‌ వైఖరి మారకుంటే ఉద్యమిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

జోనల్‌ మేనేజర్‌ వైఖరి మారకుంటే ఉద్యమిస్తాం..

Jul 12 2026 3:41 AM | Updated on Jul 12 2026 3:41 AM

జోనల్‌ మేనేజర్‌ వైఖరి మారకుంటే ఉద్యమిస్తాం..

డిపో ఎదుట నిరసనలో ఆర్టీసీ

ఎన్‌ఎంయూ జిల్లా కమిటీ

విజయనగరం అర్బన్‌: ఆర్టీసీ జోనల్‌ మేనేజర్‌ తన ఏకపక్ష వైఖరిని మార్చుకోకపోతే జిల్లా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఆర్టీసీ ఎన్‌ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీ రాఫెల్‌ హెచ్చరించారు. స్థానిక ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత జోనల్‌ మేనేజర్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేంద్ర కార్యాలయం జారీ చేసిన సర్క్యులర్లను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తున్నారని రాఫెల్‌ ఆరోపించారు. జెడ్‌ఎం తీరు వల్లే కింది స్థాయిలోని డీపీటీఓ, డీఎం వంటి అధికారులు కూడా సర్క్యులర్లను పాటించకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా, డిపో కమిటీల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement