అప్పన్నను దర్శించుకున్న ప్రముఖులు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నను దర్శించుకున్న ప్రముఖులు

Jul 12 2026 3:41 AM | Updated on Jul 12 2026 3:41 AM

అప్పన్నను దర్శించుకున్న ప్రముఖులు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం పలువురు ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఒడిశా మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి గోకులానంద్‌ మల్లిక్‌, విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌, గిరిజన సహకార సంస్థ వైస్‌ చైర్‌పర్సన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక దర్శించుకున్న వారిలో ఉన్నారు. వీరంతా ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో అర్చకులు ఆయన పేరిట అష్టోత్తరశతనామావళి పూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదం దేవస్థానం ఈవో జె.వెంకటరావు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement