రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో వెన్నుపోటు పాలనకు రెండేళ్లు సందర్భంగా లక్కవరపుకోట మండలంలోని గోల్డ్‌స్టార్ జంక్షన్‌లోని వెంకటసాయి కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ అధ్యక్షతన గురువారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రెండేళ్ల చంద్రబాబు పాలనను నిరసిస్తూ నల్ల కండువాలు వేసుకొని నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. – శృంగవరపుకోట


