పతకాలు పట్టిన పైలెట్
శృంగవరపుకోట: వెటరన్ అథ్లెట్‌గా పతకాలు పట్టేస్తున్న ఆ పైలెట్ మరోమారు సత్తాచాటి పతకాలు పట్టేశాడు. 108వాహనంలో పైలెట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎన్ మూర్తి బాపట్లలోని ఆర్ట్స్ ఎండ్ సైన్స్ కళాశాల మైదానంలో డిసెంబర్ 13,14 తేదీల్లో నిర్వహించిన 7వ ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 45+ విభాగంలో పోటీపడిన ఎంఎస్‌ఎన్.మూర్తి జావెలిన్ త్రోలో స్వర్ణం, డిస్క్‌త్రోలో స్వర్ణం, హేమర్ త్రోలో రజత పతకాలను సాధించాడు. వరుసగా పతకాల పంట పండిస్తున్న వెటరన్ పైలెట్‌ను స్థానిక క్రీడాకారులు అభినందించారు.


