24/7 అందుబాటులో మద్యం
● మద్యం కేరాఫ్ మన్యం జిల్లా
● జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా బెల్ట్ షావుల నిర్వహణగ
అనధికార విక్రయాలపై
ప్రత్యేక నిఘా
అనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎప్పటికప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో బెల్ట్ షావులపు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. సారా రవాణా తయారీ అమ్మకాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నాం. అనధికార మద్యం, సారా వంటివి విక్రయిస్తూ ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లావ్యాప్తంగా పీడీయాక్ట్‌లను నమోదు చేస్తాం. బి.శ్రీనాథుడు, ఎకై ్సజ్ ఈఎస్,
ఉమ్మడి విజయనగరం జిల్లా
పార్వతీపురం టౌన్: ఓ వైపు ప్రభుత్వ వైఫల్యం, మరోవైపు ఎకై ్సజ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజారోగ్యానికి తూట్లు పడుతున్నాయి. గడిచిన ఏడాదిన్నరగా జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు, పారిశుద్ధ్య లోపం, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న మన్యం వాసులకు మద్యం కష్టాలు తెచ్చి పెడుతోంది. జిల్లాలో గ్రామ గ్రామాన మద్యం, సారా ఏరులై పారుతోంది. జిల్లా కేంద్రంలో వేకువ జాము నుంచే మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దానికి తోడు మన్యం జిల్లా వ్యాప్తంగా, ఏఓబీ గ్రామాల్లో, గిరిజన సీమల్లో, గిరిశిఖర గ్రామాల్లో మద్యం, సారా ఏరులై పారుతోంది. దాదాపు అన్ని గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాలు, గ్రామాల్లో, పట్టణాల్లో బహిరంగంగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఏఓబీ గ్రామాల్లో సారా తయారీ చేస్తున్న కేంద్రాలు కుటీర పరిశ్రమలుగా ఏర్పడ్డాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, గెడ్డలు, వాగులు, నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాలను వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుని బెల్లపు ఊటలను తయారు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో అక్రమంగా సారాను తయారు చేస్తూ జిల్లా కేంద్రంగా అనేక జిల్లాలకు దాటిస్తున్నారు. నెలలో ఏదో ఒకరోజు ఎకై ్సజ్ అధికారులు తామున్నామంటూ తూతూ మంత్రంగానే దాడులు నిర్వహిస్తూ మమ అనిపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పూర్తిస్థాయిలో నిఘా లేకపోవడంతో మన్యం జిల్లా మద్యం, సారా క్రయ విక్రయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
ప్రతి నెలా మంత్లీలు
బెల్ట్ షావు నిర్వహణకు ఎకై ్సజ్ దిగువ స్థాయి సిబ్బంది నుంచి పై అధికారుల వరకు ఒక్కొకరికి భారీ మొత్తంలో ముడుపులు అందిస్తున్నారన్న బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.
రవాణా అంతా రాత్రివేళలోనే..
గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన సారాను కొంతమంది వ్యాపారులు రాత్రివేళల్లో ఆటోలు, బైక్‌ల ద్వారా మైదానం, పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మన్యంలో సరిహద్దు గ్రామాలైన జయకోట, బొత్తరాపల్లి, మూలకర్ని, విక్రాంపురం, అలమండ, సోరుపల్లి, సందుబడి. రేగులపాడు, సంబలబాయి, ఎగువ పిల్లిడ్డి, జీడివలస, అత్తిగడ, జగ్గూడ, టికరపాడు, కప్పలాడ, మానిక్యంవలస, ఎడుగుమ్మలవలస, పొల్ల, చిన్నబగ్గ, కడగండి, ఓండ్రుజోల, వలగజ్జి, వలగజ్జి గ్రామాల మీదుగా జనసంచారం లేని మార్గాలగుండా సారాను తరలిస్తున్నారు. పార్వతీపురం, కురపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు ఇక్కడనుంచి ప్లాస్టిక్ కేన్లలో రవాణా చేస్తున్నారు. దీనిపై ఎకై ్సజ్ శాఖ నిఘా కొరవడింది. దీంతో రోజుకు కొన్ని వేల లీటర్ల సారా రవాణా అవుతోంది. జిల్లాలో అనధికారికంగా 600 పైగా మద్యం బెల్టు దుకాణాలు ఉన్నాయి. ఏడాదిన్నరగా ఇప్పటి వరకు 700 కేసులు నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. ఏఓబీ గ్రామాల్లో 18 అంతరాష్ట్ర దాడులు నిర్వహించి 4లక్షల లీటర్ల పులిసిన బెల్లపు ఉటలు ధ్వంసం చేశారు. 21 వేల లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.
మద్యం మత్తులో బతుకులు ఛిద్రం
శుభకార్యాలు, పండుగల సమయాల్లో ఎక్కువగా మద్యాన్ని తాగుతారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యం మద్యం లభిస్తుండంతో వేకువజాము నుంచే మందుబాబులు బెల్ట్ షావుల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. గతం కంటే అధిక ధరకే లభిస్తున్నా వెనుకంజ వేయడం లేదు. దీనికి బానిసలై బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. కాయకష్టం చేసి సంపాదించిన మొత్తం మద్యానికి తగలేసి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కిడ్నీ, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో ఆస్పత్రి పాలవుతున్నారు. మద్యం, సారా తాగడం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో పెద్దగా అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు. దీంతో గిరిజనుల్లో చైతన్యం కొరవడింది.
24/7 అందుబాటులో మద్యం


