ఉత్సాహంగా వెటరన్స్ బ్యాడ్మింటన్ పోటీలు
విజయనగరం: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాట్మింటన్ పోటీలు ఉల్లాసంగా సాగాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో గల ఇండోర్ స్టేడియంలో వెటరన్స్ విభాగంలో సీ్త్ర, పురుషులకు నిర్వహించిన బాడ్మింటన్ పోటీలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రారంబించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 100మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ బాడ్మింటన్‌కు జిల్లాలో పెరుగుతున్న ఆదరణ చూసి ఆనందంగా ఉందన్నారు. మానసిక ఆరోగ్యంతో పాటు, శారీరక ఆరోగ్యం ఎంతగానో మెరుగు పడతాయన్నారు. వెటరన్స్ ఇంతమంది ఆడడం వల్ల యువతకు కూడా స్ఫూర్తిగా నిలిచినవారవుతున్నారనారు. జిల్లాస్థాయి పోటీల్లో క్రీడా స్ఫూర్తితో ఆడి రాష్ట్ర పోటీల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీశ్, అసోసియేషన్ నాయకులు డా.వీఎస్ ప్రసాద్, కుసుంబచ్చన్, కార్యదర్శి నున్నా సురేష్, అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో వెటరన్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ధాన్యం కుప్పలు దగ్ధం
బాడంగి: మండలంలోని రావివలస గ్రామానికి చెందిన గొర్లిలక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన మూడు ధాన్యం కుప్పలు ఆదివారం కాలిపోయినట్లు బాధితురాలు తెలిపింది. పాల్తేరు రెవెన్యూ పరిధిలోగల పెద్దచెరువు పొలంలో రెండెకరాల వరిచేనును ఒకేచోట మూడుకుప్పలుగా వేయగా కాలిపోయినట్టు కన్నీటి పర్యంతమైంది. మూడుకుప్పలను నూర్చితే సుమారు లక్షరూపాయలకు ధాన్యం వచ్చేవని విలపించింది. ఎవరో కావాలనే తనపై కక్షతో ఈపనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కల్పించుకుని తమకు న్యాయంచేయాలని మొరపెట్టుకుంటోంది.
ఐదు దేవాలయాల్లో చోరీ
వేపాడ: ఒకే రాత్రి..ఒకే ఊరు..ఒకే రహాదారిని ఆనుకుని ఉన్న ఐదు దేవాలయాల్లో హుండీలను దుండగులు పగులగొట్టి సొమ్ము దొంగిలించారు. ఈ సంఘటనతో గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై సుదర్శన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలంలోని బానాది గ్రామంలో ఎం.సింగవరం బల్లంకి వెళ్లే రహాదారిని ఆనుకుని ఉన్న ఐదు దేవాలయాల్లో ఏడు హుండీలు పగులగొట్టి శనివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.41 వేల నగదు ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్లు ఎస్సై తెలిపారు. ఆదివారం ఉదయం ప్రజలు, ఆలయ అర్చకులు వచ్చేసరికి హుండీలు పగలగొట్లి ఆలయం బయట ఉండడంతో ఆవాకై ్క వెంటనే గ్రామపెద్దలు, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఆలయ ఆర్చకుడు మేడపాటి కిశోర్‌శర్మ ఇచ్చిన ఫిర్యాదుమేరకు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేశారు. ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు ఐదు ఆలయాల్లో చోరీ సంఘటనపై పరిశీలించి గ్రామస్తులను ఆరాతీశారు. క్లూస్ టీమ్ హుండీలు, ప్రధానగేట్‌పై వేలిముద్రలు సేకరించారు.
బైక్‌పై నుంచి జారిపడి మహిళ మృతి
సీతానగరం: మండలంలోని జాతీయరహదారిపై అంటిపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఈ మేరకు స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. రామవరం పంచాయతీ, రెడ్డివాని వలస గ్రామానికి చెందిన రెడ్డి విజయలక్ష్మి గ్రామంలో నుంచి ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌పై ఎక్కి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి జారి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. గాయాల పాలైన విజయలక్ష్మిని అదే మోటార్ సైకిల్‌పై చికిత్స నిమిత్తం బొబ్బిలి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఉత్సాహంగా వెటరన్స్ బ్యాడ్మింటన్ పోటీలు
ఉత్సాహంగా వెటరన్స్ బ్యాడ్మింటన్ పోటీలు
ఉత్సాహంగా వెటరన్స్ బ్యాడ్మింటన్ పోటీలు


