రాజాంలో శ్రీలీల సందడి
రాజాం: పట్టణంలోని పాలకొండ రోడ్డులో సీఎంఆర్ షాపింగ్ మాల్ 44వ స్టోర్‌ను సినీనటి, డ్యాన్స్ క్వీన్ శ్రీలీల ఆదివారం ప్రారంభించారు. తొలుత షాపులో జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌లోని పలు రకాల వస్త్రాలను సందర్శించారు. షాపింగ్‌మాల్‌ను ప్రారంభించిన అనంతరం పక్కన ఏర్పాటుచేసిన ఓపెన్ స్టేజ్‌పైనుంచి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. డ్యాన్స్‌తో అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్‌తో తనకెంతో అనుబంధం ఉందని వెల్లడించారు. సీఎంఆర్ అంటే నమ్మకమని వెల్లడించారు. నాణ్యమైన వస్త్రాలు, జ్యూవెలరీ అందరికీ అందుబాటులో సీఎంఆర్ అందిస్తుందన్నారు. రాజాం పట్టణంలో ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడంతో పాటు ఈ ప్రాంత ప్రజలు అందరికీ సరసమైన ధరలకు వస్త్రాలు లభిస్తాయని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ రాజాంలో కొన్ని నెలల క్రితం సీఎంఆర్ జ్యూయలరీ ప్రారంభించామని, ప్రజలు ఎంతో ఆదరించారని తెలిపా రు. ఇప్పుడు వస్త్రదుకాణాన్ని ప్రారంభించామని, 20 మండలాల ప్రజలకు ఈ షాపింగ్ మాల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన వస్త్రాలును అందుబాటు ధరలో ఉంచుతున్నామని, అన్ని రకాల వస్త్రాలపై క్రిస్మస్, సంక్రాంతి ఆఫర్‌లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, సీఎంఆర్ డైరెక్టర్ బాలాజీ, లింగమూర్తి, సీవీ జగన్నాథస్వామి, కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, దొరబాబు, రైజింగ్ రాజు తదితరులు ప్రేక్షకులును అలరించారు.


