ప్రహసనంగా... పరిష్కార వేదిక
ఫిర్యాదు తేదీ కంటే ముందే పరిష్కార
నివేదిక
కాగితాల్లో అధికారుల మాయాజాలం
ఫైళ్లలో పరిష్కారం.. క్షేత్రంలో సమస్యలే..
పీజేఆర్‌ఎస్‌కి వచ్చే అర్జీల్లో
రెవెన్యూ శాఖవే అధికం
●పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి
చెందిన అర్జీదారుడు ఒకరు పురపాలక పరిపాలన శాఖకు సంబంధించిన సమస్యను ఈ నెల 10న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీ పెట్టుకున్నారు. రెండు రోజుల్లో అంటే ఈ నెల 12న విచారణ నివేదికను అర్జీదారులకు పంపారు. అయితే విచారణ జరిగిన తేదీలు పరిహాసం కలిగించాయి. విచారణకు రమ్మని నోటీసు ఇచ్చిన తేదీలు గత నెల 28వ తేదీ అంటూ
నివేదికలో ఇచ్చారు. పరిశీలనా ప్రశ్నలన్నింటినీ అర్జీదారుని కలిసినట్టు, విచారణ సమయంలో ఫొటో కూడా తీసినట్టు నివేదికలో ఇచ్చారు.
నివేదిక చూసిన అర్జీదారుడు ఒకింత
ఆశ్చర్యపోయారు.
●రేగిడి ఆమదాలవలస మండలం బూరాడ గ్రామంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణపై గడిచిన మూడు వారాలు జరిగిన పీజేఆర్‌ఎస్‌కి ఆ గ్రామ సర్పంచు వావిలపల్లి శశిభూషణరావు, ఎంపీటీసీ సభ్యులు వావిలపల్లి జగన్మోహనరావు, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులతో పాటు 11 మంది ఫిర్యాదులు ఇస్తునే ఉన్నారు. కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఆ గ్రామ పంచాయతీ సర్వే నెం.64–2 విస్తీర్ణం యూ.3.12 సెంట్లుతో వ్యవసాయ పట్టాలు రద్దు చేయమని కోరారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వారు చెప్పుకున్నారు. ఆ అర్జీలు కాగితాలకే పరిమితమై రెవెన్యూ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇలాంటి అర్జీదారుల వినతులను రీ ఓపెన్ చేస్తునే ఉన్నారు. కానీ పరిష్కార నివేదికలో మాత్రం కాకి లెక్కలతో సక్సస్ చూపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
విజయనగరం అర్బన్:
ప్రజల సమస్యలను పరిష్కరిస్తామనే లక్ష్యంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహణ ప్రజలను పరిహాసం చేస్తుంది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కేవలం కాగితాలపై పరిష్కార నివేదికలుగా మారాయి. గత ప్రభుత్వం ‘స్పందన’ పేరుతో సచివాలయ గ్రామ, వార్డు స్థాయిలోనే ఫిర్యాదులు తీసుకొని ముఖ్యమంత్రి పేషి దృష్టికి నేరుగా వెళ్లే వ్యవస్థను నిర్మించింది. నిర్థిష్ట సమయంలో అధికారులు పరిష్కరించకపోతే చర్యలు తీసుకొనే పరిస్థితి ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం ఆ వ్యవస్థను నీరుగార్చుతోందనే అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత స్పందన పేరును మార్చుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ప్రారంభం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు అర్జీలు పరిశీలిస్తే అఽత్యధికంగా రెవెన్యూ విభాగానికే 26,849 వినతు లు వచ్చాయి. వీటిలో తొలిసారి పెట్టిన అర్జీకి పరిష్కారం కానివి 80 శాతం వరకు ఉన్నాయి. రెండోసారి ఫిర్యాదును రీ ఓపెన్ చేసినవి వాటిలో 60 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు పీజీఆర్‌ఎస్ నిర్వహణపై నమ్మకం లేక రీ ఓపెన్ చేయడం లేదని తెలుస్తుంది. మరో వైపు రెవెన్యూ శాఖలో ఇంతవరకు పరిష్కా రం కాకుండా పెండింగ్‌లో 1,879 వినతులు ఉన్నా యి. వీటిని మళ్లీ రీ ఓపెన్ చేస్తున్నారు. ఈ నెల ఒకటి నాటికి 4.12 శాతం అర్జీలను రీ వెరిఫికేషన్ పోర్టల్‌లో ఉంచారు.
సాక్షి, గజపతినగరం సెల్ : 90102 04447
ప్రహసనంగా... పరిష్కార వేదిక
ప్రహసనంగా... పరిష్కార వేదిక
ప్రహసనంగా... పరిష్కార వేదిక


