నేడు పీజీఆర్‌ఎస్
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పా రు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని సరిగా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదు ను తీసుకురావాలని సూచించారు. మండల, డివిజన్ అధికారుల కార్యాలయంలో కూడా పీ జీఆర్‌ఎస్ నిర్వహించాలని ఆదేశించారు.
విజయనగరం టౌన్: గోవా గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త పూస పాటి అశోక్ గజపతిరాజు ఎంపికవ్వడం తెలు గు వారందరికీ గర్వకారణమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పేర్కొన్నారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం ఆత్మీ య సత్కార సభను నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు గా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాజాం : స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో రాజాంకు చెందిన శ్రీ పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివా రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు కత్తులకవిటికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, సామాజిక సేవా కార్యకర్త దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు, ఆయన బంధువులు ఘనంగా సత్కరించారు. అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్ర దర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కా ర్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విజయనగరం క్రైమ్ : శాంతిభద్రతల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ సోమవారం తలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించినట్టు విజయనగరం ఇన్‌చార్జ్ ఆర్.గోవిందరావు వెల్లడించడంపై జనం విస్తుపోతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత మరింతగా బయటపడి చంద్రబాబు పాలనపై ప్రజాగ్రహం మరింత రెట్టింపు కావడం ఖాయ మనే భావనతోనే ప్రభుత్వమే ఇటువంటి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేసే హక్కు పౌరులకు ఉంటుందని, దీన్ని అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలో ర్యాలీకి అనుమతి కోరారని.. కానీ ర్యాలీ నిర్వహించ తలపెట్టిన ప్రాంతం ముఖ్య వ్యాపార కూడళ్లు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా శాంతి దృష్ట్యా ర్యాలీకి అనుమతి నిరాకరించినట్టు ఇన్‌చార్జ్ డీఎస్పీ ఆదివారం వెల్లడించడంతో పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు, మేధావులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేడు పీజీఆర్‌ఎస్


