లోక్‌అదాలత్‌లో 9,513 కేసుల పరిష్కారం
విజయనగరం లీగల్: రాజీయే రాజమార్గమని, కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహపూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్‌అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. జాతీయ లోక్‌అదాలత్ వల్ల కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు వృథా కాదన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో శనివారం నిర్వహించి జాతీయలోక్‌అదాలత్‌లలో 9,513 కేసులు పరిష్కరించినట్టు వెల్లడించారు. వాటిలో సివిల్ కేసులు 424, క్రిమినల్ కేసులు 9,028, ప్రీ లిటిగేషన్ కేసులు 61 ఉన్నాయన్నారు. బీమా కంపెనీకి చెందిన రూ.90 లక్షలను మోటారు ప్రమాద బీమా కేసుల్లో పిటిషనర్లకు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, నాలుగవ శ్రేణి న్యాయమూర్తి బి.అప్పలస్వామి, మహిళా మరియు ఐదవ జిల్లా న్యాయమూర్తి ఎన్.పద్మావతి, కె.నాగమణి, పోక్సోకోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయమూర్తి ఎ.కృష్ణ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి, బార్ అసోసియేషన్ సభ్యులు, కక్షిదారులు పాల్గొన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌కు హాజరైన కక్షిదారులందరికీ న్యాయవాది కుమారస్వామి మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటుచేశారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
లోక్‌అదాలత్‌లో 9,513 కేసుల పరిష్కారం


