చిన్నారులకు ఆపన్నహస్తం
జామి: తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు విజయ్, గౌతమ్‌లకు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. చిన్నారుల దీన స్థితిపై ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, దాతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా జడ్జితో పాటు పలువురు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎస్.కోట యూట్యూబ్ ఛానల్‌కి చెందిన నవీన్‌రామ్‌సింగ్ శనివారం జన్నివలస గ్రామానికి వచ్చి పిల్లలకు చిన్నగృహం నిర్మాణం నిమిత్తం రూ.40 వేలును వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు. నిత్యావసర సరుకులు, దుస్తులు వితరణగా అందజేశారు. పలువురు దాతలు చిన్నారులకు అండగా నిలుస్తుండడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
సాక్షి
కథనానికి
స్పందన
చిన్నారులకు ఆపన్నహస్తం


