పూరిల్లు దగ్ధం: వృద్ధురాలికి గాయాలు
రాజాం సిటీ: మండల పరిధి బొమ్మినాయుడువలస పంచాయతీ విజయరాంపురం గ్రామంలో ఓ పూరిల్లు దగ్ధంకాగా అందులో నిద్రిస్తున్న వృద్ధురాలు గాయాల పాలైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన లింగాల పైడమ్మ అనే వృద్ధురాలి పూరిల్లు శుక్రవారం వేకువజామున విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో కూడా ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా నిద్రలో ఉన్న వృద్ధురాలి శరీరం కాలిపోవడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమై ఆమెను ఎలాగోలా బయటకు తీసి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ ఎస్సై పి.అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. వృద్ధురాలిని గ్రామానికి చెందిన మాజీ వలంటీరు, ఆటో డ్రైవర్ దాలి అప్పలనాయుడు రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
పూరిల్లు దగ్ధం: వృద్ధురాలికి గాయాలు


