● పసివారికి సాయం
జామి: తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మారి, పూరిగుడిసెలో నివసిస్తూ.. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతో కాలంగడుపు తున్న జామి మండలం జన్నవిస గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారుల దీనస్థితిపై ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’లోశుక్రవారం ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయమూర్తి ఎ.కృష్ణ ప్రపాద్ శుక్రవారం గ్రామానికి వెళ్లి చిన్నారులు గౌతమ్, విజయ్ ఇంటిని చూసి వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల విద్యాభ్యాసానికి భరోసా ఇచ్చారు. వసతి గృహల్లో విద్యాభ్యాసానికి నచ్చిన చోట తగిన ఏర్పాట్లు చేయిస్తానని భరోసా కల్పిడంతోపాటు చిన్నారులకు, వారి పెద్దమ్మకు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్కట్ స్వచ్ఛంద సంస్థ వారు చిన్నారులకు బట్టలు, నిత్యావసర సరుకులను గ్రామసర్పంచ్ శీరెడ్డి చందునాయుడు, మాతృభూమి సేవాసంఘం సభ్యుడు కొట్యాడ రవి చేతుల మీదుగా వితరణగా అందించారు. కొత్తవలస ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న కృష్ణాపురం గ్రామానికి చెందిన బొజ్జ ప్రసాద్ గ్రామానికి చెందిన రామారావు చేతుల మీదుగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఐసీడీఎస్ పీఓ అచ్యుతకుమారి మిషన్ వాత్సల్య పథకం మంజూరుకు హామీ ఇచ్చారు. పలువురు దాతలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, స్థానికులు వారికి అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారు.
స్పందించిన హృదయాలు
చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయమూర్తి
నిత్యావసర సరుకులు, నగదు వితరణ
‘సాక్షి’ కథనానికి స్పందన
● పసివారికి సాయం
● పసివారికి సాయం


