8,900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
● 70 లీటర్ల సారా స్వాధీనం
● ఏఓబీలో ఎకై ్సజ్‌శాఖ విస్తృత దాడులు
కురుపాం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్ బి.శ్రీనాఽథుడు ఆదేశాల మేరకు ఏఈఎస్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించినట్లు కురుపాం ఎకై ్సజ్‌శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు ఆంధ్రా–ఒడిశా ఎకై ్సజ్‌శాఖల సంయుక్త దాడులను సరిహద్దు గ్రామాలైన సందుబడి, తంలబాయి, రేగలపాడు గ్రామాల్లో దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం సిద్ధం చేసి 8,900 లీటర్ల పులిసిన బెల్లం ఊట ధ్వంసం చేయడంతో పాటు అక్రమంగా తరలించేందుకు ఉంచిన 70 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలి పారు.ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ వీవీవీ శేఖర్ బాబు, బోర్డర్ మొబైల్ పార్టీ ఇన్‌స్పెక్టర్ వెంకటరాజు, రాజాం, చీపురుపల్లి, పాలకొండ ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బందితోపాటు కురుపాం ఎకై ్సజ్ ఎస్సై శేఖర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.


