కదంతొక్కిన అంగన్‌వాడీలు
–10లో
● ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట ధర్నా
● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన
పేదోడి పళ్లెంలో ‘ప్రొటీన్’ మాయం
సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పేదవాడికి కనీస అవసరమైన ‘కందిపప్పు’ను అందించడంలో చేతులెత్తేసింది.
చెరకు రైతుకు ఊరట
విజయనగరం జిల్లాలోనే కాకుండా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో చెరకు సాగుచేస్తున్న రైతులకు ఈ ఏడాది ఎట్టకేలకు ఊరట లభించింది.
విజయనగరం ఫోర్ట్:
అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు అంగన్‌వాడీలు కదం తొక్కారు. ఎన్నికల్లో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంపై చొరవచూపకపోవడంపై మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. పోరాడతాం.. సాధించి తీరుతాం, అంగన్‌వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని యాప్‌లు కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, అర్హతలను సడలించి మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ కార్యకర్తలుగా మార్చాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, రాజకీయ వేధింపులు నిలిపివేసి రాజాం ప్రాజెక్టులో నలుగురు హెల్పర్లుకు పదోన్నతలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యూటీ అమలకు గైడ్‌లైన్స్ రూపొందించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, ప్రీస్కూల్ విద్యను బలోపేతం చేయాలన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.పైడిరాజు, కార్యదర్శి అనసూయ, గౌరవాధ్యక్షరాలు వి.లక్ష్మి, జి.శారద, టి.మాలతి, ఎ. ఉషారాణి, ఎం. కృష్ణవేణి, జి.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడికక్కడ నిర్బంధం
రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు అంగన్‌వాడీలు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం పోలీసులతో అడుగడుగునా ఆటంకం కలిగించింది. యూనియన్, సీఐటీయూ నాయకులను గృహ నిర్బంధం చేశారు. జిల్లా కేంద్రానికి బయల్దేరిన వర్కర్లను, నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్సులు, ఆటోల్లో వస్తున్న వారిని మార్గంమధ్యంలోనే నిలుపుదల చేసి వెనక్కి పంపారు. కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిర్బంధాలను అధిగమించి అంగన్‌వాడీలు భారీగా నిరసన కార్యక్రమానికి తరలివచ్చారు.
ఉద్యోగభద్రత కల్పించాలి
అంగన్‌వాడీలకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనాలు చెల్లించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలి. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.
– బి.పైడిరాజు, అంగన్‌వాడీవర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు
ఎందుకంత వివక్ష
అంగన్‌వాడీలపై కక్షతగదు. అంగన్‌వాడీ సిబ్బంది పిల్లలకు తల్లికి వందనం పథకం అందజేయకపోవడం దారుణం. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇటీవల సరఫరా చేసే పప్పుల్లో నాణ్యత తక్కువగా ఉంటోంది. నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి.
– అనసూయ, అంగన్‌వాడీవర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి
కదంతొక్కిన అంగన్‌వాడీలు
కదంతొక్కిన అంగన్‌వాడీలు
కదంతొక్కిన అంగన్‌వాడీలు
కదంతొక్కిన అంగన్‌వాడీలు
కదంతొక్కిన అంగన్‌వాడీలు
కదంతొక్కిన అంగన్‌వాడీలు
కదంతొక్కిన అంగన్‌వాడీలు


