నిధుల స్వాహాపై అధికారుల విచారణ | - | Sakshi
Sakshi News home page

నిధుల స్వాహాపై అధికారుల విచారణ

Dec 13 2025 7:19 AM | Updated on Dec 13 2025 7:19 AM

నిధుల

నిధుల స్వాహాపై అధికారుల విచారణ

రూ.43.44లక్షలు స్వాహా అయినట్టు నిర్ధారణ

రేగిడి: మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన బ్యాంకు మిత్ర (సీఎస్‌పీ) ఆ గ్రామానికి చెందిన 39 సంఘాలకు సంబంధించి రూ.43.44 లక్షల నగదు సొంతానికి వాడుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. సెర్ప్‌ డీపీఎం ఎ.చిరంజీవి, బ్యాంకు లింకేజీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ జె.లక్ష్మునాయుడు, సీ్త్రనిధి మేనేజర్‌ సుధాకర్‌తో పాటు రేగిడి యూనియన్‌ బ్యాంకు అధికారులు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. సభ్యుల వద్ద నగదుకు సంబంధించి వివరాలు సేకరించారు. సంఘాల నిధుల స్వాహాకు పాల్పడిన సీఎస్పీ అల్లు శ్రీధర్‌పై చర్యలకు సిఫార్స్‌ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీపీఎం మాట్లాడుతూ సీ్త్ర నిధికి సంబంధించి రూ.2 లక్షలు, పొదుపు, బ్యాంకు లింకేజీలకు సంబంధించి రూ.41లక్షలకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని చెప్పారు. మహిళా సంఘాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం బాసిన గోవిందరావు, సిబ్బంది పాల్గొన్నారు.

గాయపడిన మహిళకు ఎస్పీ సపర్యలు

విజయనగరం క్రైమ్‌: గుర్ల మండల కేంద్రానికి సమీపంలో ప్రమాదానికి గురై గాయపడిన మహిళకు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ సపర్యలు చేశారు. దగ్గరుండి ఆటోలో ఎక్కించి నెల్లిమర్ల మిమ్స్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ గరివిడిలో జరిగిన అభ్యుదయం సైకిల్‌యాత్రలో పాల్గొని తిరిగి వస్తుండగా గుర్ల మండలం దుగ్గివలసకు చెందిన దంపతులు బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. వెనుక కూర్చున్న మహిళ తీవ్రంగా గాయపడింది. అటుగా కారులో వస్తున్న ఎస్పీ దామోదర్‌ గుర్తించి వెంటనే వాహనాన్ని ఆపి గాయపడిన మహిళకు సపర్యలు చేశారు. తాగునీటిని అందించారు. భర్తకు ధైర్యం చెప్పి ఆస్పత్రికి తరలించారు.

24న జాతీయ

వినియోగదారుల దినోత్సవం

విజయనగరం అర్బన్‌: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ నెల 24న నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవ్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18 నుంచి వారోత్సవాలను నిర్వహించాలని సూచించారు. జిల్లా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సంబంధిత అధికారులు, వినియోగదారుల సంఘాల సభ్యులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘డిజిటల్‌ న్యాయపాలన ద్వారా సమర్ధ సత్వర పరిష్కారం’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వినియోగదారుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల, ఇంటర్‌ స్థాయివారికి తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో వరుస ముగ్గురు విజేతలకు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. మొదటి బహుమతి సాధించిన విద్యార్థులను విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు. జాతీయ విననియోగదారుల దినోత్సవాన్ని ఒక పాఠశాల లేదా కళాశాలలో నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం వారోత్సవాల ప్రచారపత్రాన్ని విడుదల చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి జి.మురళీనాథ్‌, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, లీగల్‌ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్‌ బి.మన్మోహన్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పి.వెంకటరమణ, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు చదలవాడ ప్రసాద్‌, పీఎస్‌బీ నాయుడు, ఎం.ఎస్‌.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

నిధుల స్వాహాపై అధికారుల విచారణ 1
1/2

నిధుల స్వాహాపై అధికారుల విచారణ

నిధుల స్వాహాపై అధికారుల విచారణ 2
2/2

నిధుల స్వాహాపై అధికారుల విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement