హౌసింగ్ డీఈ తీరుపై ఆందోళన
రామభద్రపురం: పీఎంఏవై పథకం కింద మంజూరయ్యే ఇంటి గ్రాంటు విషయంలో హౌసింగ్ డీఈ వివక్ష చూపుతున్నారంటూ రామభద్రపురం మండలంలోని నాయుడువలస గ్రామానికి చెందిన ఎస్సీ లబ్ధిదారులు ఆరోపించారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు శుక్రవారం బైఠాయించి నిరసన తెలిపారు. లబ్ధిదారులకు ఇంటి గ్రాంట్ మంజూరయ్యేలా చూడాలంటూ ఎంపీడీఓ రత్నంకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం 106 మంది దరఖాస్తుదారుల వివరాలను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు ఆవాస్ ప్లస్ యాప్‌లో నమోదు చేశారని, అందులో టీడీపీకి చెందిన 32 మంది పేర్లు మాత్రమే హౌసింగ్ ఏఈ లాగిన్ నుంచి పంపి పరిశీలిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీ ముద్రవేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. సొంతస్థలంలో ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇల్లు నిర్మించుకుందామన్న ఆశ అడియాశగానే మారుతోందని వాపోయారు. న్యాయం జరగకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు నడిమింటి సత్యంనాయుడు, కె.పార్వతి, ఎల్.సింహాచలం, ఎం.అప్పలనరసమ్మ, ఎం. వెంకటలక్ష్మి, ఇ.సింహాచలం, చింతాడ లక్ష్ము, శివ, జీనపాటి బంగారమ్మ, చింతాడ గురువులు, వెంకటరమణ, నవీన్, జీనపాటి సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల లబ్ధిదారుల జియోట్యాగింగ్‌లో వివక్ష
టీడీపీ వారికి మాత్రమే గ్రాంట్
మంజూరుకు మొగ్గు
ఎంపీడీఓ కార్యాలయం ముందు
ఎస్సీ లబ్ధిదారుల ఆందోళన
న్యాయం చేయాలంటూ ఎంపీడీఓకు వినతి


