రుక్మిణి సిల్క్స్‌లో.. వస్త్రాల నిధి
● వస్త్రాలయం ప్రారంభోత్సవంలో సందడి చేసిన నిధి అగర్వాల్
● సినీనటిని చూసేందుకు
తరలివచ్చిన జనం
నిధి అగర్వాల్
విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో సినీతార నిధి అగర్వాల్ గురువారం సందడి చేశారు. సినీ పాటలకు స్టెప్పులు వేసి యువతను అలరించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఎస్‌వీఎన్ లేక్ ప్యాలస్ ఎదురుగా గురువారం చేపట్టిన రుక్మిణి సిల్క్స్ వస్త్రాలయం ప్రారంభోత్సవంలో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి వస్త్రాలయాన్ని ప్రారంభించారు. సినీతార నిధి అగర్వాల్ నాలుగు అంతస్తుల వస్త్రాలయాన్ని సందర్శించారు. వివిధ రకాల చీరలు ధరించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు విక్రయించే రుక్మిణి సిల్క్స్ వస్త్రాలయాన్ని ప్రతి ఒక్కరు సందర్శించాలని కోరారు. రానున్న సంక్రాంతి వరకు కేవలం రూ. 34కే చీరలు, రూ.150కే పురుషుల షర్ట్స్‌తో పాటు చిన్నపిల్లల దుస్తుల విక్రయాలపై ప్రత్యేక ఆఫర్‌లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే నెల్లూరు, ఖమ్మం జిల్లాల్లో విశేష ఆదరణ పొందుతున్న రుక్మిణీ సిల్క్స్ వస్త్రాలయం తాజాగా ప్రత్యేక ఆఫర్‌లు, సరమైన ధరల్లో విజయనగరంలో వస్త్రాల విక్రయాన్ని ప్రారంభించడం సంతోషయదాయకమన్నారు. వస్త్రాలయం అధినేతలు జి.వి.మురళి, జి.శ్రీనివాస్ మాట్లాడుతూ వస్త్రవ్యాపార రంగంలో 30 ఏళ్ల అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా మూడవ బ్రాంచ్‌ను ప్రారంభించామని, అతి తక్కువ ధరలకే ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. వినియోగదారుల ఆదరణే తమ లక్ష్యమని, భవిష్యత్‌లో మరిన్ని జిల్లాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి సంక్రాంతి పండగ వేడుకకు అవసరమైన వస్త్రాలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు.
అభిమానులకు అభివాదం చేస్తున్న సినీ తార నిధి అగర్వాల్
రుక్మిణి సిల్క్స్‌లో.. వస్త్రాల నిధి


