రైతులను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవు
● అన్ని రకాల ధాన్యం కొనుగోలు
చేయాల్సిందే..
● సీఎస్‌డీటీ రెడ్డి సాయికృష్ణ
రామభద్రపురం: మిల్లులకు ధాన్యం తెచ్చిన రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని సీఎస్‌డీటీ రెడ్డి సాయికృష్ణ మిల్లర్లను హెచ్చరించారు. సంపత్ స్వర్ణ, ఎంటీయూ–1064 రకాల ధాన్యం మరపట్టించే సమయంలో ముక్క అవుతుడండతో కొనుగోలు చేయలేమని, క్వింటాకు 10 కిలోలు అదనంగా ఇవ్వాలని మిల్లర్లు రైతులకు తెగేసి చెబుతున్నారు. ఆయా రకాలను మిల్లుల వద్ద దింపేందుకు ఇష్టపడడం లేదు. ధాన్యం లోడు చేసిన ట్రాక్టర్లు రోజుల తరబడి మిల్లుల వద్దనే ఉండాల్సిన దుస్థితి. ఇదే అంశంపై ఈ నెల 11వ తేదీన ‘ఎక్కడి ధాన్యం అక్కడే..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. తహసీల్దార్ అజు రఫీజాన్, సీఎస్‌డీటీ రెడ్డి సాయికృష్ణ మండలంలోని ధాన్యం మిల్లులను పరిశీలించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలుచేయాలని సూచించారు. మరీ నాణ్యతలేని సరుకువస్తే మా దృష్టిలో పెట్టాలని, తాము రైతులతో మాట్లాడుతామని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్వోలు అనిల్, మహేషకుమార్ పాల్గొన్నారు.
కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక ఏకగ్రీవం
బొండపల్లి: మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్‌గా వైఎస్సార్‌సీపీ మదతుదారు షేక్ జైనబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో కో ఆప్షన్ మెంబర్‌గా పని చేసిన బొండపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ అబ్దుల్ రజాక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ స్థానానికి గురువారం ఎన్నిక నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి ఏవీ సాల్మన్‌రాజు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా.. పోటీకి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో జైనబీ ఎన్నిక ఏకగ్రీవమైంది. కార్యక్రమంలో ఎంపీపీ చల్లా చలంనాయుడు, వైస్ ఎంపీపీ గొండేల ఈశ్వరరావు, ఎంపీడీఓ జి.గిరిబాల, ఈఓపీఆర్‌డీ రఘుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం
మెరకముడిదాం: మండల కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. మెరకముడిదాం గ్రామానికి చెందిన షేక్ సుభాన్ వైఎస్సార్‌సీపీ తరఫున గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికల అధికారి డీవీ మల్లికార్జునరావు సుభాన్ ఎన్నికై నట్లు ప్రకటించి ధ్రువీకరణపత్రం అందజేశారు. అనంతరం మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులతో ఎంపీపీ తాడ్డి కృష్ణవేణి అధ్యక్షతన ఎంపీడీఓ గొర్లె భాస్కరరావు సమావేశం నిర్వహించారు.
రైతులను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవు
రైతులను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవు


