● యూరియా కష్టాలు యథాతథం
విజయనగరం జిల్లా చిత్తరాపురం
సచివాలయం వద్ద యూరియా
కోసం బారులు తీరిన రైతులు
విజయనగరం జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. ఖరీఫ్‌లో యూరియా దొరకక నానా అగచాట్లు ఎదుర్కొన్నారు. రబీలోనూ అదే పరిస్థితి నెలకొంది. సంతకవిటి మండలం చిత్తారపురం సచివాలయం వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూకట్టారు. వాస్తవంగా అక్టోబర్ 10వ తేదీన యూరియా పంపిణీ చేయాల్సి ఉంది. చిత్తారపురం రెవెన్యూ పరిధిలో తమ భూములు ఉన్నాయని, తమకు కూడా యూరియా అందజేయాలంటూ గెడ్డబూరాడపేట, పనసపేట రైతులు డిమాండ్ చేశారు. వచ్చిన యూరియా తక్కువగా ఉండడం, డిమాండ్ అధికంగా ఉండడంతో పంపిణీని నిలిపివేశారు. ఆ రెండు గ్రామాల రైతులకు మరో లోడ్ వచ్చాక పంపిణీ చేస్తామని సీఐ, ఏఓ సీహెచ్ యశ్వంతరావు నచ్చజెప్పడంతో గురువారం పోలీసుల సమక్షంలో రైతుకు బస్తాచొప్పున యూరియా పంపిణీ చేశారు.
– సంతకవిటి
● యూరియా కష్టాలు యథాతథం
● యూరియా కష్టాలు యథాతథం


