25వ బ్యాచ్ ఆర్టీసీ డ్రైవర్స్ శిక్షణ ప్రారంభం
విజయనగరం అర్బన్: ఆర్టీసీలో డ్రైవింగ్ శిక్షణ క్వాలిటీతో కూడినదని అభ్యర్థులు క్రమశిక్షణతో నేర్చుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి.వరలక్ష్మి అన్నారు. స్థానిక ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్స్ ట్రైనింగ్ కళాశాలలో 25వ బ్యాచ్ శిక్షణ తరగతులను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్స్ ట్రైనింగ్ కళాశాల రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థ అని శిక్షణ పొందిన వందలాది మంది అభ్యర్ధులు వివిధ డిపోల్లో ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత 25వ బ్యాచ్ అభ్యర్థులు కూడా క్రమశిక్షణ, మెలకువలు, సాఽంకేతిక నైపుణ్యాలు సమపాళ్లలో నేర్చుకుని ఉత్తమ డ్రైవర్లుగా పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ బ్యాచ్‌లో చేరిన మహిళా అభ్యర్థిని ఎన్.గీతను అభినందించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, శిక్షకులు డీఎన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


