రెండు బైక్‌ల కాల్చివేత
విజయనగరం క్రైమ్: విజయనగరం టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదరవీధిలో బుధవారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేసిన రెండు బైక్‌లను గుర్తు తెలియని వ్యక్తి అగ్గిపెట్టెతో కాల్చివేశాడు. మేదరవీధికి చెందిన పూజారి పోలిపల్లి వీరబాబు బంధువు ఇంటి ముందు పల్సర్‌తో పాటు ఫ్యాషన్ బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తి గంజాయి మత్తులో కాల్చివేశాడు. ఈ మేరకు వీరబాబు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా సీఐ శ్రీనివాస్ క్రైమ్‌పార్టీ బృందం వాసు, షఫీజ్ లను ఘటనా స్థలానికి పంపించి ఆధారాలు సేకరించారు. గంజాయి మత్తులోనే గుర్తు తెలియని వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించామని సీఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతామని ,త్వరలో ఆ వ్యక్తిని పట్టుకుంటామన్నారు.
రెండు బైక్‌ల కాల్చివేత


