13 తులాల బంగారం చోరీ
రేగిడి: మండల పరిధిలోని బాలకవివలస గ్రామంలో బంగారం చోరీ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు అందించిన సమా చారం మేరకు గ్రామానికి చెందిన కిల్లారి రమణ, భార్య కమల పొలం పనులకోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. పొలం పనులు ముగించుకుని తిరిగి వచ్చి చూసేసరికి ఎప్పటిలాగానే ఇంటికి వేసిన తాళం వేసినట్లే ఉంది. బీరువాలో ఉన్న 13 తులాల బంగారం చోరీకి గురైందని బాధితులు ఫిర్యాదు చేశారు. గడిచిన వారం రోజుల క్రితం ఇంటికి సంబంధించిన ఒక తాళం పోయిందని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర బుధవారం గ్రామానికి వెళ్లి ఇంటిని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


