జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఐదుగురు ఎంపిక
తెర్లాం: జాతీయస్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. 2026 జనవరిలో నాగపూర్‌లో జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీలు జరగనున్నాయి. ఈనెల 6 నుంచి 8వరకు గుంటూరు జిల్లా మోదుకూరులో జరిగిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–19 పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు విశేష ప్రతిభ కనబరిచాయి. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర జట్టు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని, బాలికల జట్టు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా జట్లలోని పలువురి సభ్యులను జాతీయస్థాయి పోటీలకు నిర్వాహకులు ఎంపిక చేశారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నచ వారిలో పి.జనార్దనసాయి(డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం–సాలూరు), ఎస్.చరణ్(జెడ్పీ హైస్కూల్–ఉల్లిభద్ర), టి.మోహన్‌సాయి(జెడ్పీ హైస్కూల్–పారాది), బాలికల జట్టుకు యు.లోకేశ్వరి(జెడ్పీ హైస్కూల్–తూడెం), ఎం.ప్రసన్న(జెడ్పీ హైస్కూల్–బాడంగి)లు ఉన్నారు. వారంతా వచ్చే ఏడాది జనవరిలో నాగపూర్‌లో జరగనున్న జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులను ఎస్‌జీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు, జిల్లా జట్ల మేనేజర్ సీహెచ్.సత్యనారాయణ, కోచ్‌లు శివ, మహేష్‌లు అభినందించారు.


