ఏఆర్ డీఎస్పీ మానవత్వం
విజయనగరం క్రైమ్: కాఠిన్యంతో ఎప్పుడూ ఉండే ఖాకీ గుండె కరిగింది. ఈ మేరకు ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తికి విజయనగరం ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి సపర్యలు చేసి, స్వయంగా హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించి శభాష్ పోలీస్ అని అనిపించుకున్నారు. విజయనగరం ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీగా పని చేస్తున్న ఈ.కోటిరెడ్డి విధుల్లో భాగంగా గంట్యాడ మండలం రామవరం వైపు బుధవారం వెళ్లారు. తిరిగే వస్తున్న క్రమంలో బైక్‌పై విజయనగరం నుంచి వస్తున్నఓ వ్యక్తి సెల్ఫ్ యాక్సిడెంట్‌కు గురై, రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడినట్లు డీఎస్పీ గుర్తించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, గాయపడిన వ్యక్తికి సపర్యలు చేసి, మంచినీరు అందించి, 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి..స్థానికుల సహకారంతో అంబులెన్స్ లోకి స్వయంగా ఎక్కించి, విజయనగరం మహారాజా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. స్థానికులు, బంధువులు డీఎస్పీ ఈ.కోటిరెడ్డి అందించిన సేవల పట్ల కృతజ్ఞతలు తెలిజేశారు.
రోడ్డు ప్రమాద బాధితుడికి సహాయం


