జనకోటి వ్యతిరేకత
వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై..
సాక్షిప్రతినిధి, విజయనగరం:
ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి విజయనగరం జిల్లాలో విశేషఆదరణ లభించింది. నియోజక వర్గాలు, పట్టణాలు, మండలాలు, పంచాయతీల్లో యువత, విద్యార్థులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ప్రైవేటీకరణపై వ్యతిరేకత తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై సంతకం రూపంలో నిరసన వ్యక్తంచేశారు. జన‘కోటి’ సంతకాల ప్రతులను జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి బుధవారం ర్యాలీగా విజయనగరం జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యు లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కోటి సంతకాల పత్రాలను శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలగట్ల వీరభధ్రస్వామి, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, బొత్స అప్పలసనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, తలే రాజేష్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పరిశీలించారు.
● విజయపథంగా...
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతంగా సాగింది. సేకరించిన 54,899 సంతకాల ప్రతులను ర్యాలీగా వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి తర లించారు. ముందుగా సంతకాల ప్రతులను పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఉంచి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సాగిన బైక్ ర్యాలీని ప్రారంభించారు.
● కోట నుంచి విజయనగరానికి...
సంతకాల ఉద్యమ ముగింపు కార్యక్రమాన్ని ఎస్.కోట పట్టణంలోని దేవీ కూడలిలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంతకాల ప్రత్రులను వాహనంలోకి చేర్చి ర్యాలీగా విజయనగరంలోని పార్టీ కార్యాలయానికి చేర్చారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు నెక్కల నాయుడుబాబు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
● రామతీర్థం టు విద్యలనగరం..
నెల్లిమర్ల నియోజకవర్గంలో సేకరించిన సంతకాల ప్రతులను మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో రాములోరి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకునేలా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించారు. అనంతరం 67వేల సంతకాల ప్రతులను సుమారు 500 కార్లు, బైక్‌లతో ర్యాలీగా విజయనగరం జిల్లా కేంద్రానికి చేర్చారు.
● రాజాం నియోజకవర్గం ప్రజల నుంచి సేకరించిన 50 వేల సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో రాజాం అంబేడ్కర్ కూడలి నుంచి విజయనగరం తరలించారు. ముందుగా అంబేడ్కర్ కూడలి వద్ద ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ రాజాం సమన్వయకర్త తలే రాజేష్ సంతకాల ప్రతులను ప్రదర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
● వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రత్రులను బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో ర్యాలీగా వేణుగోపాలస్వామి ఆలయం వద్దకు చేర్చారు. చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని, ప్రభుత్వ వైద్యకళాశాలలు ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని దేవుడిని ప్రార్థించారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి సంతకాల ప్రతులను విజయనగరం చేర్చారు. కార్యక్రమంలో పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు ఇంటి గోపాలరావు, ఆర్థిక మండలి రాష్ట్ర మాజీ సభ్యుడు తూముల భాస్కరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.వి.మురళీకృష్ణారావు, పార్టీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
● గజపతినగరం నియోజకవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల ప్రతులను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు విజయనగరం చేర్చారు. ముందుగా సంతకాల ప్రతులతో గజపతినగరంలో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా నినదించారు. వైద్యకళాశాలలు ప్రైవేటీకరణ కావడం వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, ఎంపీపీలు సింహాద్రి అప్పలనాయుడు. బెల్లాన జ్ఞానదీపిక, జెడ్పీటీసీలు గార తౌడు, వర్రి నరసింహమూర్తి, రౌతు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
● చీపురుపల్లి నియోజకవర్గంలో సేకరించిన 50వేల సంతకాల ప్రతులతో మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్, కుమార్తె బొత్స అనూష, పార్టీ నాయకులు చీపురుపల్లిలో ర్యాలీ నిర్వహించారు. సంతకాల ప్రతులకు ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి చేర్చారు. వీటన్నింటినీ ఈ నెల 15న జిల్లా కేంద్రంతో ఉరేగింపు చేసి 17వ తేదీన గవర్నర్‌కు అందజేయనున్నారు.
విజయనగరంలో
సంతకాల ప్రతులతో బైక్ ర్యాలీ
చంద్రబాబు ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహం
ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై ప్రజావ్యతిరేకత
వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంతకాల
ఉద్యమానికి అనూహ్యస్పందన
సంతకాల ప్రతులను ఊరేగింపుగా జిల్లా కేంద్రానికి తరలింపు
జనకోటి వ్యతిరేకత
జనకోటి వ్యతిరేకత
జనకోటి వ్యతిరేకత
జనకోటి వ్యతిరేకత


