టెట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డీఈఓ
డెంకాడ: మండలంలోని జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో ఏపీ టెట్ నిర్వహ ణను డీఈఓ ఎం.మాణిక్యంనాయుడు బుధ వారం పరిశీలించారు. జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన పరీక్షకు 590కి 550 మంది, మధ్యాహ్నం పరీక్షకు 561కి 496 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు టెట్ కొనసాగుతుందన్నారు.
మానవ హక్కులపై అవగాహన
విజయనగరం అర్బన్: మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ రాష్ట్ర విభాగం ఆదేశా ల మేరకు ప్రపంచ మానవ హక్కుల దినోత్స వం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు లు, ర్యాలీలు నిర్వహించారు. మహారాజా అటానమస్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎం.సాంబశివరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హక్కుల కోసం ప్రశ్నించడం నేర్చుకోవాలని, ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుందని పిలుపునిచ్చారు. కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలు రాకేష్, సంధ్యకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్‌ఐ ప్రసన్నకుమార్, అడ్వకేట్ కరుణాకర్, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ నోడల్ అధికారి జి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
టెట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డీఈఓ


