విజయనగరం
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కోటి సంతకాలకు విశేష స్పందన
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవా రం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు ప్రజల నుంచి భారీ
సంఖ్యలో అర్జీలు అందాయి. –8లో
రేగిడి:
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అనూహ్య స్పందన లభించిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. రేగిడిలో విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 10న నియోజకవర్గ స్థాయిలో కోటి సంతకాల ప్రతుల సేకరణకు, ఈ నెల 15న జిల్లా స్థాయిలో చేపట్టనున్న కోటి సంతకాల ర్యాలీకి ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు విడుదల కాక విద్యార్థులు, ఎరువులు, విత్తనాలు దొరకకపోవడం, పంట కొనుగోలు చేయక రైతులు, ఉద్యోగాలులేక, నిరుద్యోగ భృతి అందక నిరుద్యోగులు, పింఛన్లు మంజూరుకాక అర్హులు, రీ వెరిఫికేషన్‌తో దివ్యాంగులు.. ఇలా ప్రతి వర్గం ఇబ్బందులు పడుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటగా మారిందన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు టి.అచ్చెన్నాయుడు, వి.జగన్మోహనరావు, దవళేశ్వరరావు, తదిరులు ఉన్నారు.
విజయనగరం
విజయనగరం
విజయనగరం


