● ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు నిర్వహణ ● హాజరుకానున్న అ
బొబ్బిలి రూరల్: మోంథా తుఫాన్ వరదలకు విశాఖ–రాయగడ అంతరరాష్ట్ర రహదారిలో పారాది వద్ద వేగావతి నదిపై నిర్మించిన తాత్కాలిక కాజ్‌వే కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వరద సహాయ నిధి నుంచి రూ.15 లక్షలను కలెక్టర్ మంజూరు చేయడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతు పనులు పూర్తిచేశారు. కాజ్‌వేపై సోమవారం నుంచి భారీ వాహనాల రాకపోకలకు అనుమతించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేగావతి నదిపై కొత్తగా వంతెన నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అప్పటి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. పిల్లర్ల వరకు పూర్తయిన వంతెన పనులకు చంద్రబాబు ప్రభుత్వం మరో మూడున్నర కోట్లు బడ్జెట్ పెంచింది. శ్లాబ్ పనులను బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు సోమవారం ప్రారంభించారు.
విజయనగరం టౌన్: సైనిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని జిల్లా సైనిక సంక్షేమాధికారి కేవీఎస్ ప్రసాద్ అన్నారు. భారత సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని కలెక్టర్, జిల్లా సైనిక సంక్షేమ సంఘం చైర్మన్ రాంసుందర్‌రెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సాయుధ దళాల పతాక నిధికి విరివి గా విరాళాలివ్వాలన్నారు. సైనిక సంక్షేమానికి ప్రజలిచ్చిన ప్రతిపైసా భారత సైన్యంలో వీరమరణం పొందిన, రక్షణ దళంలో విశిష్ట సేవలందించిన కుటుంబాల సంక్షేమ సహాయానికి అందించబడతాయన్నారు. కార్యక్రమంలో డి. ఈ శ్వరరావు, ఎన్‌సీసీ అధికారులు, సైనిక సంక్షేమ సిబ్బంది, వివిధ అసోసియేషన్‌ల ప్రతినిధులు, మాజీ సైనికోద్యోగులు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష–2025 (ఏపీ టెట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 13,985 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారన్నారు. వీరికోసం 5 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని వివరించారు.
గంట్యాడ: ప్రభుత్వం జీఓ నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, వేతన సవరణతో పాటు మధ్యంతర భృతి చెల్లించాలని ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక నాయకుడు మంగయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగులతో కలిసి గంట్యాడ డీసీసీబీ బ్రాంచి ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీ సిలింగ్ విధించి రూ.2 లక్షలు మాత్రమే చెల్లించడం సరికాదన్నారు. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని, రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
● ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు నిర్వహణ ● హాజరుకానున్న అ


