కదం తొక్కిన రైతులు
విజయనగరం ఫోర్ట్: గుర్ల మండలంలో ఏర్పాటుచేయనున్న సూపర్ స్మెల్టర్ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా పలు గ్రామాల రైతులు కదం తొక్కారు. ట్రాక్టర్లపై వందలాది మంది కలెక్టరేట్‌కు చేరుకుని సోమవారం ఆందోళన చేశారు. ‘స్టీల్ ప్లాంట్ వద్దు.. పచ్చని పంట పొలాలే ముద్దు, భూములు ఇవ్వకు.. భవిష్యత్ చంపకు, మా భూమి.. మా హక్కు’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినదించా రు. సూపర్ స్మెల్టర్స్‌ప్లాంట్ వ్యతిరేక పోరాట కమి టీ గౌరవాధ్యక్షుడు బుద్దరాజు రాంబాబు మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. ఏడాదికి రెండు పంటలు పండే భూములను ప్లాంట్ కోసం ఇచ్చేదిలేదని తెగేసిచెప్పారు. ఇక్కడి నేలను, నీరు, గాలిని కలుషితం చేస్తామంటే చూస్తూ ఊరుకోబో మన్నారు. ఆందోళనలో గుర్ల మండలంలోని దమరసింగి, వల్లాపురం, బెల్లాన పేట, మన్యపురిపేట, కెల్ల, ఎస్.ఎస్.ఎస్.ఆర్.పేట తదితర గ్రామాల రైతులు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీపీ పొట్నూరు సన్యాసినాయుడు, గుర్ల సన్యాసినాయుడు, గుర్ల జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వి.వెంకటేశ్వర్లు, పోరాట కమిటీ కన్వీనర్ మీసాల ప్రసాద్, కో కన్వీనర్ మందపాటి కృష్ణం రాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు కె.వి.సూర్యనారాయణ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీపీఐ నాయకులు బుగత అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన రైతులు


