వాళ్ల పింఛన్లు ఆపేయండి..! | - | Sakshi
Sakshi News home page

వాళ్ల పింఛన్లు ఆపేయండి..!

Dec 8 2025 7:34 AM | Updated on Dec 8 2025 7:34 AM

వాళ్ల

వాళ్ల పింఛన్లు ఆపేయండి..!

వాళ్ల పింఛన్లు ఆపేయండి..!

టీడీపీ నేతల హుకుం పసుపు కండువా వేసుకుంటెనే పింఛన్లు మంత్రి కొండపల్లి ఇలాకాలో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు వంతపాడుతున్న అధికారులు లోకల్‌ లీడర్లను కలవాలని డీఆర్‌డీఏకు చెందిన ఓ అధికారి ఉచిత సలహా 8 నెలలుగా పింఛన్లు ఇవ్వకుండా తిప్పుతున్న వైనం

డీఆర్‌డీఏకు పంపించాం..

గంట్యాడ మండలం వసాది గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి ఎర్రయ్యమ్మ భర్త లక్ష్మీనారాయణ ఏడాది క్రితం మరణించాడు. అతనికి వృద్ధాప్య పింఛన్‌ వచ్చేది. దీంతో అతని భార్య మరుసటి నెల స్పౌజ్‌ కోటా కింద వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసింది. పింఛన్‌ మంజూరుకు సంబంధించి ఐడీ కూడా వచ్చింది. కాని ఆమెకు టీడీపీ నేతలు చెప్పారని అధికారులు పింఛన్‌ నిలిపివేసినట్టు

ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 8 నెలలుగా ఆమె పింఛన్‌ కోసం

అధికారులను అడిగినా ఫలితం లేకుండా పోయింది.

గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన సారిక కళావతి

భర్త పోలయ్య 2025 ఏప్రిల్‌ నెలలో మరణించాడు. అతనికి వృద్ధాప్య

పింఛన్‌ వచ్చేది. దీంతో ఆమె స్పౌజ్‌ కోటా కింద వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసింది. ఈమెకు వితంతు పింఛన్‌ మంజూరైనట్టు ఐడీ కూడా

వచ్చింది. అయితే ఈమెకు కూడా టీడీపీ నేతలు చెప్పారని అధికారులు

మంజూరైన పింఛన్‌ నిలిపివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా టీడీపీ నేతలు కూడా మేమే పింఛన్లు నిలిపివేసినట్టు ప్రచారం చేసుకుంటున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

గంట్యాడ:

ర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతవుల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సింది పోయి వారిని మరింత క్షోభకు గురిచేసే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శ లు వినిపిస్తున్నాయి. వితంతు పింఛన్‌ ఇచ్చి వారిని ఆదుకోవాల్సింది పోయి పసుపు కండువా కప్పుకుంటెనే పింఛన్‌ మంజూరు చేస్తామని టీడీపీ నేత లు బహిరంగంగానే చెబుతున్నారు. వితంతవుల పట్ల కూడా టీడీపీ నేతలు, చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేయడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. మీరు మా కండువా కప్పుకోలేదు కాబట్టి మీ పింఛన్లు నిలిపివేశామని వితంతువుల వద్ద టీడీపీ నేతలు అన్నట్టు తెలుస్తుంది.

లోకల్‌ లీడర్లను కలవండంటూ ఉచిత సలహాలు

టీడీపీ నేతలకు వంతపాడే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లు ఏది చెబితే దానికి తలాడించే విధంగా నడుచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా సమస్య వస్తే తమ ఉద్యోగులకు ఎసరు వస్తుందనే విషయాన్ని ఉద్యోగులు తెలుసుకోలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా వారికి వితంతు పింఛన్‌ ఎందుకు మంజూరు కావడంలేదని డీఆర్‌డీఏకి చెందిన ఓ అధికారిని వితంతు బంధువు అడగ్గా లోకల్‌టీడీపీ లీడర్లను కలవాల్సింది కదా.. అని ఉచి త సలహా ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రి కొండపల్లి ఇలాకాలోనే...

మంత్రి కొండపల్లి ఇలాకా అయిన గంట్యాడ మండలంలో టీడీపీ నేతలు ఇలా వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి ఉన్నారు.. మనల్ని ఆపేది ఎవడు.. అన్న విధంగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌, పాఠశాలల వాచ్‌మెన్‌లు, ఆయాలను, కేజీబీవీ ఆయా, వెలుగు వీవోఏలను తొలిగించేశారు. ఇప్ప డు పింఛన్‌దారులను కూడా వదలడం లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఫించను మంజూ రు చేయలేదు. వృద్ధాప్య పింఛన్‌ వచ్చే వ్యక్తి మరణిస్తే అతని భార్యకు భాగస్వామి పింఛన్‌ కింద ఇచ్చే వితంత పింఛన్‌ మంజూరులోనూ టీడీపీ నేత లు రాజకీయం చేస్తున్నారు. తమ కండువా వేసుకు ని తమతో తిరిగితేనే పింఛన్‌ మంజూరు చేస్తామని బాధితులకే బరి తెగించి చెబుతున్నారు. చంద్రబా బు ప్రభుత్వంలో రాజకీయ సిఫార్సులు, పసుపు కండువాలు వేసుకోవాలని బరితెగింపుగా చెప్పడం పట్ల జనం మండిపడుతున్నారు.

సారికి కళావతి, ఎర్రయ్యమ్మ వితంతు పింఛ న్ల కోసం వచ్చిన దరఖాస్తులను అప్రూవల్‌ చేసి డీఆర్‌డీఏకు పంపించాం. అక్కడ ఏ సమస్యతో ఆగిందో తెలియదు. దీనిపై రెండుసార్లు డీఆర్‌డీఏకు లేఖ కూడా రాశాం. ఉన్నత అధికారుల కు పంపించామని వారు చెబుతున్నారు.

– ఆర్‌.వి.రమణమూర్తి, ఎంపీడీవో

వాళ్ల పింఛన్లు ఆపేయండి..! 1
1/1

వాళ్ల పింఛన్లు ఆపేయండి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement