ప్రణాళిక ఫలించేనా..!
కేజీబీవీల్లో వెనుకబడిన విదార్థినుల ఉత్తీర్ణతకు ‘విజయపథం’ అమలు పది, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం ఉత్తమ ఫలితాలపై ఉపాధ్యాయినులు, విద్యార్థినులు గురి ఈ ఏడాది నుంచి ఇంటర్ ఫస్టియర్‌కు సీబీఎస్‌ఈ అమలు ఉత్తీర్ణత సాధనపై ఆందోళనలో ఆయా విద్యార్థినులు, టీచర్లు
మార్గదర్శకాలు ఇవీ..
మంచి మార్కులు సాధిస్తా..
పకడ్బందీగా విజయపథం అమలు..
రామభద్రపురం:
ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఎంతో కీలకం. ఆయా పరీక్ష ఫలితా ల్లో ఉత్తమ మార్కులు సాధించేందుకు ప్రతీ ఒక్క రూ శ్రమిస్తుంటారు. వారికి టీచర్లు తోడ్పాటు అందిస్తారు. ఈ క్రమంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కూడా ఈ ఏడాది పది, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నూ నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలనే ఆశయంతో సమగ్రశిక్ష అధికారులు ప్రణాళికలు రూపొందిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా అన్ని కేజీబీవీ విద్యాలయాలలో దాదా పు సిలబస్‌లు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నా రు. జిల్లాలోని 26 చొప్పున్న కేజీబీవీ పాఠశాల లు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పదో తరగతిలో 973 మంది, ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరంలో 750 మంది, సెకండియర్‌లో 750 వార్షిక పరీక్షల్లో హాజరు కానున్నారు. గతేడాది పదో తరగతి విద్యార్థులు 92 శాతం ఫలితాలతో రాష్ట్రంలో జిల్లా పదో స్థానం సాధించింది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 79 శాతం ఫలితాలు సాధించి పదో స్థానంలో నిలవగా సెకెండియర్‌లో 93 శాతం ఫలితాలు సాధించి 5వ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియెట్, మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది సుమారు అన్ని విద్యాలయాల్లో వంద శాతం ఫలితాలు సాధన కోసం విజయ పథం పేరుతో సమగ్రశిక్ష వంద రోజుల ప్రణాళికలు రూపొందించింది.
కేజీబీవీ విద్యాలయాల్లో చదువుతున్న ఫస్టియర్ విద్యార్థినులకు ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేయనున్నందున ఆయా విద్యార్థినుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది స్టేట్ సిలబస్‌లో పరీక్షలు రాసి 79 శాతంతో రాష్ట్రంలో జిల్లా పదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది సీబీఎస్‌ఈ సిలబస్ అమలుతో విద్యార్థినుల్లో కొత్తగా అనిపించడంతో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే ఆశయం సాధ్యమవుతుందా.. అని ఇటు టీచర్లు, అటు సమగ్ర శిక్ష అధికారుల్లో కూడా అందోళన వ్యక్తమవుతోంది.
కేజీబీవీ విద్యార్థినుల పట్ల ఏపీసీ, జీసీడీవో ప్రతీ రోజూ పర్యవేక్షణ చేస్తున్నారు. అన్ని పాఠశాలలు విద్యార్థినుల అభ్యసన స్థాయిపై సమీక్షలు చేపడుతున్నారు. విద్యార్థుల చదువుతో పాటు మెనూ ప్రకారం భోజనం తీరుపై గూగుల్ మీట్ ద్వారా తెలుసుకుంటున్నారు.
టీచర్లు పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధతో పాటు వారి లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం. ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్, రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రోజుకో పాఠ్యాంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహి స్తూ విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పు డు నివృత్తి చేస్తున్నారు. ఎస్‌ఏ–1 పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతీరోజు రాత్రి సమయంలో రోజుకో పాఠ్యాంశంపై స్టడీ అవర్స్ నిర్వహించి మరుసటి రోజు ఉదయం ఆ సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తున్నారు.
మా కళాశాలలో అధ్యాపకులు అర్ధమయ్యే రీతి లో విద్యాబోధన చేస్తున్నారు. ప్రత్యేక తరగతు ల్లో సబ్జెక్టుల్లో సందేహా లను నివృత్తి చేస్తున్నా రు. ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేస్తున్నారు. ఉత్తమ మార్కులు సాధనలో కొద్దిగా భయం ఉన్నా ప్రతీ రోజు తరగతులలో రోజుకో సబ్జెక్టుపై పరీక్షలు నిర్వహిస్తున్నందున కొంత మేర భయం పోయింది. మా అధ్యాపకుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధిస్తాను.
– తోట లోకేశ్వరి, ఇంటర్ ఫస్టియర్ బైపీసీ, కేజీబీవీ, బూసాయవలస
కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాల సాధనకు విజయ పథం పకడ్బందీగా అమలు చేస్తున్నాం. పదో తరగతితో పాటు ఇంటర్మీడియెట్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వంద శాతం ఫలితాలు లక్ష్యంగా ప్రతీరోజు పర్యవేక్షణ చేస్తున్నాం. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం ఉంది.
– ఎ.రామారావు, ఏపీసీ, విజయనగరం
ప్రణాళిక ఫలించేనా..!
ప్రణాళిక ఫలించేనా..!


