శ్రీరామనామ సంకీర్తనతో మార్మోగిన రామతీర్థం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామివారి దేవస్థానం శ్రీరామనామ సంకీర్తనతో ఆదివారం మార్మోగింది. స్వామి సన్నిధిలో పలువురు భక్తులు సహస్ర శ్లోకీ రామాయణ పారాయణం ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరాకాండ హోమాన్ని జరిపించారు. ఉత్సవమూర్తుల వద్ద స్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించిన అనంతరం భగవత్ రామానుజ దాస బృందానికి చెందిన భక్తులు సహస్ర శ్లోకి రామాయణం 72వ ఆవృతం, శ్రీమన్నారాయణ వైభవం 70వ ఆవృతం పారాయణం చేశారు. ఈ సందర్భంగా బృంద సభ్యుడు శ్రీమాన్ కందాల రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు సింహాచలం, శ్రీకూర్మం, పద్మనాభం, తదితర దివ్య క్షేత్రాల్లో పారాయాణాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసర ఆందోళన చెలరేగకుండా పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు. స్క్రబ్ టైఫస్‌పై సమగ్ర సమాచారం అంది స్తూ ఈ వ్యాధి సమయానికి గుర్తిస్తే 100 శాతం నయమవుతుందని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మైట్స్ కాటు ద్వారా వచ్చే ఈ జ్వర వ్యాధి లక్షణాలను వివరాల ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి గుర్తించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో పరీక్ష చేయించుకుంటే అక్కడే ఉచితంగా అందే మందులతో పూర్తిగా నయమవుతుందని ఆలస్యం చేయొద్దని హెచ్చరించారు. అదనంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారిని వెంట నే పీహెచ్‌సీ లేదా సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించాలని ఆదేశించారు. స్క్రబ్ టైఫస్ భయపడాల్సిన వ్యాధి కాదని జాగ్రత్తలు పాటి స్తే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడికి కలిస్తే సులభంగా నయమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
విజయనగరం అర్బన్: హిందీ భాషాభిమానుల వేదికగా పేరొందిన హిందీ మంచ్ జిల్లా శాఖ కొత్త కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. స్థానిక పూల్‌బాగ్‌లోని సరస్వతి శిశుమందిర్‌లో జరిగిన ఎన్నికల సభలో జిల్లా అధ్యక్షులుగా ఏలూరు శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా నందివాడ చిన్నాదేవి, గౌరవాధ్యక్షురాలుగా పి.ఉమాబాల, సహాధ్యక్షురాలుగా భోగరాజు సూర్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్ర కార్యదర్శి కోనే శ్రీధర్ ఎన్నికల సమన్వయకర్త గా వ్యవహరించారు. సంఘం కార్యదర్శిగా కె.రోజా, కె.శారదా పద్మావతి, ఉపాధ్యక్షులుగా ఆశాపు చంద్రారావు, విజయలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా సాలూరు సంతోషి, వై.సూర్యకుమారి, శ్రీదేవి ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారుగా కె.సుబ్బారావు, గౌరవ సలహాదారుగా దవళ సర్వేశ్వరరావును ఎంపిక చేశారు.


